సినిమా పూర్తవడానికి వచ్చినా నాగ చైతన్య- సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ఇప్పటి వరకూ టైటిల్ ఫిక్స్ చేయలేదు. ’దోచెయ్’ అని టైటిల్ అనుకున్నారు కానీ, దాన్ని మార్చుదామనే ఆలోచన కూడా ఉంది. అందుకే ఈ టీజర్, పోస్టర్లు టైటిల్ లేకుండానే వచ్చేశాయి. అయితే చాలా చర్చల తరువాత ఈ సినిమాకు అదే టైటిల్ను ఫిక్స్ చేశారు. క్రైమ్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే ఈ చిత్రంలో నాగచైతన్య మోసగాళ్ళకు మోసగాడుగా నటిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థ మవుతుంది. ఈ నెలాఖరులో ఆడియో ఫంక్షన్ చేయనున్నట్టు నిర్మాత బి.వి.ఎస్.ఎస్ ప్రసాద్ తెలిపారు. సినిమాను మార్చి 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్ నాగచైతన్యకు జంటగా నటిస్తోంది. తన తొలి సినిమా ‘స్వామి రారా’ తరహాలోనే ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం.