గోవింద కూతురు సెకండ్ హాండ్ మొగుడుతో...

June 19, 2015 | 05:01 PM | 0 Views
ప్రింట్ కామెంట్
tina_ahuja_debut_second_hand_husband_niharonline

ఈ ముద్దు గుమ్మ ఎవరుకుంటున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో గోవింద కూతురు... మరి ఇంత పెద్ద స్టార్ కూతురికి సెకండ్ హాండ్ మొగుడెంటి? అనే అనుమానం కలుగుతుంది కదా? అదే నండీ... ఈ భామకూ సినిమా హీరోయిన్ అయిపోవాలనే కోరిక కలిగింది అందుకే సెకండ్ హాండ్ మొగుడిని పట్టుకుంది. అదే నండీ ‘సెకండ్ హాండ్ హస్టెండ్’ అనే హిందీ చిత్రంతో తన మొదటి సినిమాకు శ్రీకారం చుట్టింది. దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన గోవిందా కుమార్తె టీనా అహూజా 'సెకండ్ హ్యాండ్ హజ్బెండ్' నటిస్తోందిప్పుడు. తన తండ్రి వారసత్వం కారణంగా తన మీద చాలా పెద్ద బాధ్యత ఉందని టీనా చెబుతోంది. తన తొలి ప్రాజెక్టు గురించి ఒకవైపు ఎంతో ఉత్సుకతగాను, మరోవైపు భయంభయంగాను ఉందని తెలిపింది. సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ సినిమాలో ఆమెతో పాటు ధర్మేంద్ర, జిప్పీ గ్రేవాల్ కూడా నటిస్తున్నారు. తొలి సినిమా చేసేందుకు ఎందుకు ఇంతకాలం వేచి చూశారని ప్రశ్నించగా, తానింకా సినీపరిశ్రమలోకి ప్రవేశించడానికి సిద్ధం కానప్పుడే తన గురించి మీడియాలో రాశారని.. నిజానికి 2013లోనే తాను సినిమాల్లోకి రావాల్సి అప్పట్లో వీలుపడలేదని చెపుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ