ఉత్తుత్తి వార్తలేనంటున్న గౌతం కార్తీక్

May 04, 2015 | 01:38 PM | 104 Views
ప్రింట్ కామెంట్
Gautham_Karthik_Priya_Anand_niharonline

తమిళ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న యువ నటుడు గౌతం కార్తీక్. ఈ నటుడు ఎవరో కాదు నటుడు కార్తీక్ కుమారుడు, సీనియర్ నటుడు ఆర్.ముత్తురామన్ కు మనుమడు. ఈ నట వారసుడు ప్రియా ఆనంద్ ను ప్రేమిస్తున్నాడటంటూ... వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ గౌతం వెల్లడించాడు. ప్రియా ఆనంద్ తనకు మంచి స్నేహితురాలు మాత్రమేననీ, అప్పట్లో 'సిపాయి' చిత్రంలో తనతో నటిస్తున్న లక్ష్మీమీనన్‌తో లవ్ ఎఫైర్ ఉన్నట్లు వదంతులు వ్యాపించాయని, గతంలో 'కడల్' చిత్రంలో నటిస్తుండగా తులసిని ప్రేమిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయన్నాడు. అయితే ఆ గాలి వార్తలన్నిటినీ తాను స్పోర్టివ్‌గానే తీసుకుంటున్నానని,  తదుపరి రిలీజ్ కానున్న చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది తాను నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ కానున్నాయని. అందువల్ల ఈ ఏడాది ముఖ్యమైన సంవత్సరంగా భావిస్తున్నట్లు గౌతం కార్తిక్ తెలిపాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ