ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం అంటూ భూములు సేకరణ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ భూ సేకరణ చట్టాన్ని అమలు చేస్తూ రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములు తీసుకుంటున్నప్పుడు అక్కడి ప్రజలకు పవన్ అండగా నిలిచి, వారి భూములు ప్రభుత్వ పరం కాకుండా అడ్డుకున్నాడు. దీంతో ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ ఊరి ప్రజలకు ఇప్పుడు పవన్ కళ్యాన్ దేవుడైపోయాడు. గుంటూరు జిల్లా బేత పూడి గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేవు. తమ భూములు కోల్పోకుండా అడ్డుకున్న నాయకుడిగా పవన్ ను కొలుస్తున్నారు. అందుకే అక్కడి ప్రజలు బేత పూడి పేరు మార్చి''పవన్ కళ్యాణ్ నగర్ '' అని పెట్టుకున్నారు. ఈ గ్రామ మంతా పవన్ కు ఫ్యాన్స్ అయిపోరు. ఆడ మగ యువత ముసలి అంతా పవన్ నామస్మరణే చేస్తున్నారట ఇక్కడ. తెర మీద స్టార్ అయిపోతే సరిపోదు, ఏదో ఓ మంచి పని చేసినప్పుడేగా అభిమాన స్టార్లను దేవుడిగా భావించేది.