అగ్రతారలుగా వెలుగొందుతున్న వారి నటవారసులుగా వచ్చినప్పటికీ చాలా మంది దానిని నిలబెట్టుకునేందుకు నానాతంటాలు పడతారు. ఓవైపు మమ అంటూ కానిచ్చేవారు ఉంటే, మరోవైపు నటనలో తాతలకు, తండ్రులకు తీసిపోమని నిరూపించుకునేందుకు కష్టపడే తత్వం ఉన్నావారు లేకపోలేదు. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా వెలుగొందిన చిరంజీవి వంశవృక్షం నుంచి కూడా అలా వచ్చినవారు, రాబోతున్నవారు కూడా ఉన్నారు. అయితే అలా వచ్చి నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్న స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగా మేనల్లుడిగా మొదటి రెండు చిత్రాలతోనే మంచి మార్కులు కొట్టేసి మొదట్లో మామ మెయింటెన్ చేసిన సుప్రీం ట్యాగ్ లైన్ ను తన బిరుదుగా మార్చేసుకున్నాడు. ఈ రోజు (అక్టోబర్ 15) తన పుట్టిన రోజు. ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ తరపు నుంచి ఈ సుప్రీంహీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
సినిమాల్లోకి రాకముందు వంద కిలోల పైగా బరువుండే వాడట సాయి. అయితే మామ చిరు సలహా మేరకు వెయిట్ తగ్గించుకోవటంతోపాటు డాన్సింగ్ లో కఠోర కృషి చేసి ఇప్పుడు ఇలా మనముందకు దూసుకొచ్చాడు. ఎనర్జిటిక్ యాక్షన్ తోపాటు మంచి కామెడీ టైమింగ్ కూడా సాయి సొంతం. డాన్స్ లో కూడా ఇప్పుడున్న టాప్ స్టార్ లకు ఏ మాత్రం తీసిపోకుండా అలరిస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీం అనే చిత్రంలో నటిస్తున్నాడీ సుప్రీంహీరో. డోట్ సౌండ్ హరన్ అంటూ టాక్సీ డ్రైవర్ గెటప్ లో ఉన్న ఫోటోలు ఇవాళ మీడియాకు విడుదల చేశారు. అసలే అనిల్ రావిపూడి మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమా అందించాడు. ఇక అలాంటోడి చేతిలో సాయిధరమ్ పడితే పిచ్చెక్కించటం మాత్రం ఖాయం.