బర్త్ డే స్పెషల్ : టాలీవుడ్ లెజెండ్ ‘మెగా’స్టార్ చిరంజీవి

August 22, 2015 | 12:58 PM | 3 Views
ప్రింట్ కామెంట్
megastar_chiranjeevi_60th_birthday_special_story_niharonline

మెగాస్టార్ చిరంజీవి మూడు దశాబ్దాలపాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదలిన రూపం.  తన నటన, డాన్స్ లతో అశేష జనవాహిని తన అభిమానులు మార్చుకున్న ఘనత ఆయన సొంతం. నటనలో మాత్రమే కాదు డాన్సర్, సింగర్, ప్రొడ్యూసర్, బిజినెస్..ఇలా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ ని సాధించారు.  ఆయన నటన, సమాజ సేవ..కోట్లాది అభిమానులను సంపాదించిపెట్టింది. ఇప్పటివరకు చిరంజీవి జరుపుకున్న పుట్టినరోజులు ఒక ఎత్తైతే.. ఈ 60వ పుట్టినరోజు ప్రత్యేకం. రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత ఇక సినిమాల్లో గుడ్ బై చెప్పారేమో అనుకున్న ఫ్యాన్స్ కి తీపి వార్త అందించారు. దాదాపు 6 ఏళ్ళ తరువాత మేకప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇది ఆయన 150వ సినిమా. ఈ రోజు (ఆగష్టు22) జరుపుకునేది 60 వ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనపై ప్రత్యేక స్టోరీ...

‘పునాదిరాళ్ళు’ చిరు సినీ ప్రస్థానానికి పునాది పడింది.  ఖైదీగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. తెలుగు సినీ ప్రస్థానంలో  ‘విజేత’ గా అయ్యాడు. మాస్ ప్రేక్షకుల కోసం ఘరానా మొగుడి అవతారం ఎత్తాడు. నమ్ముకున్న వారికోసం త్యాగం చేసే ఇంద్రుడై వెలిగాడు. లంచగొండుల పాలిట ఠాగూర్ గా నిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కల్ లేవు.  సరిగ్గా 60ఏళ్ళ క్రిందట గోదారి దారిలో వున్న మొగల్తూరుకి తెలియకపోవచ్చు తాను భవిష్యత్ లో సినీ సంచలనానికి కేంద్రబిందువుగా మారబోతున్నానని, అంజనా వెంకట్రావ్ దంపతులకు తెలియకపోవచ్చు రేపటి దినం అగ్ర తనయుడు ఓ పెను సంచలనంగా మారబోతున్నాడని .

వడివడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అప్పటికే ఎన్.టి.ఆర్ దేవుడిగా పూజింపబడుతున్నాడు ఏ.ఎన్.ఆర్ నవలానాయకుడిగా ప్రేమింపబడుతున్నాడు కృష్ణ కొత్తదనంతో కీర్తింపబడుతున్నాడు.. వీరి ముందు నిలబడాలంటే ఏం చెయ్యాలి.. దొరికింది. తన స్టైల్, ముఖ్యంగా డాన్స్. అప్పటిదాకా తెలుగు హీరోల్లో ఈ టైపు డాన్సులు చేసే మొనగాడు లేడు అని తనకంటూ ఒక బెంచ్ మార్క్ సృష్టించుకున్నాడు.

                               కమర్షియల్ సక్సెస్ లకు కరెక్ట్ మీనింగ్ చెప్పిన ఘనత చిరుది. అప్పటివరకూ కనీ వినీ ఎరుగని హీరోయిజం కళ్ళముందు కదలాడే సరికి అభిమానులు ఉబ్బితబ్బిబ్బైపోయేవారు. ముందు సుప్రీమ్. ఆ తర్వాత మెగాస్టార్ ఇవి సరిపోవు కావొచ్చు. అసలు హీరోల కట్ అవుట్ లకు పాలాభిషేకాలు ప్రారంభమయ్యిందే చిరు దగ్గరి నుంచి. చిన్న పిల్లలు కొత్తగా ఒక డైలాగ్ చెప్పినా ఒక స్టెప్పేసినా చిన్నగా నవ్వించినా 'ఈడు పెద్దయ్యాక చిరంజీవైపోతాడు' అన్న డైలాగ్ ప్రతీ ఇంట్లో పడే వుంటదంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్ కి ఎదిగిపోయాడు కొణిదెల శివశంకర వరప్రసాద్.

                                         149 సినిమాలు అందులో 100కు పైగా కమర్షియల్ హిట్లు 30 కి పైగా బ్లాక్ బస్టర్ లు.. అయినా కేవలం సినిమా గురించి కలెక్షన్ల గురించి మాత్రమే మాట్లాడుకునే సాధారణ వ్యక్తి కాదు చిరు. సామాజిక సేవతో అభిమానులను ముందుండి నడిపించిన శక్తి చిరంజీవి. తెలుగు ప్రేక్షకుడికి తమ షర్టు కాలర్ విలువ తెలిపిన ఘనుడు చిరు. సినీ రంగాన్ని వదిలి ఎనిమిదేళ్లయినా నెంబర్ 1 స్థానం అలానే ఖాళీగా వుంది. ఛాన్స్ దొరికినా చాలా మంది తారలు ఆ స్థానం పై కూర్చోలేదు. ఎవరోచ్చినా అది చిరంజీవిదే ఇది వారి నోటి నుంచి వచ్చిన మాట. ఈ మాట చాలదా చిరు గురించి ఎంత చెప్పుకున్నా ఎంత తక్కవే అని. ఆ కళామతల్లి ముద్దు బిడ్డ మరిన్నీ పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ... నీహార్ ఆన్ లైన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. హ్యాపీ బర్త్ డే టూ మెగాస్టార్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ