బర్త్ డే స్పెషల్: శివగామి రమ్యకృష్ణ

September 15, 2015 | 04:54 PM | 3 Views
ప్రింట్ కామెంట్
ramya-krishna-birthday-special-story-niharonline.jpg

తెలుగు వెండితెరపై కనువిందైన సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందాల నాయిక. అసమానమైన అభినయాన్ని ప్రదర్శించిన అరుదైన నాయిక. పాత్ర స్వరూప స్వభావాలు మరిచిపోకుండా ఓవైపు క్లాస్, మరోవైపు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఐదు భాషల్లో అగ్రనాయకిగా వెలుగొందిన ఘనత ఆమె సొంతం. ఇప్పుడు శివగామిగా దేశప్రజల నోళ్లలో నానుతోంది. ఆమె అందాల నటి రమ్యకృష్ణ. నేడు ఆమె పుట్టినరోజు... ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ ఆమెకు ఆమెకు విషెస్ చెబుతు ఆమె గురించి...

                    రమ్యకృష్ణ 1967 సెప్టెంబర్ 15న చెన్నైలో ఓ తమిళ్ అయ్యర్ ఫ్యామిలీలో జన్మించింది. కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన రమ్య ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు. నటనపై ఆసక్తితో చిత్ర సీమకు వచ్చిన ఆమె 13 వ ఏటా మళయాలంలో మోహన్ లాల్ సరసన నేరమ్ పులరంబోల్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ, దానికంటే ముందుగా ఆమె నటించిన 'ఏళ్ళై మనసు' అనే తమిళ చిత్రం ముందుగా రిలీజ్ కావటంతో అది ఫస్ట్ మూవీ అయ్యింది. ఇక తెలుగులో 1980 లో వచ్చిన భలే మిత్రులతో ఇక్కడ పరిచయం అయ్యింది. కెరీర్ ప్రారంభంలోనే ఇన్ని భాషల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. ఒకానోక టైంలో రమ్యకృష్ణ ఐరెన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. విశ్వనాథ్ డైరక్షన్లో వచ్చిన సూత్రధారులు ఫ్లాప్ అయినప్పటికీ దాంట్లో నటనకు మాత్రం ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో మరో స్టార్ డైరక్టర్ రాఘవేంద్ర రావు దృష్టిలో ఆమె పడ్డారు. ఆయన ఆమెకు అల్లుడుగారు చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ చిత్రం సక్సెస్ కావటంతోపాటు ఆమెపై ఉన్న ఐరెన్ ముద్ర తొలగిపోయింది. ఇక మళ్లీ రాఘవేంద్ర రావు డైరక్షన్లో వచ్చిన అల్లరి మొగుడు ఆమె జీవితాన్నే మార్చి పడేసింది. అప్పటిదాకా అమాయకపు క్యారెక్టర్లో నటించిన ఆమె చేత గ్లామర్ రసాన్ని ఒలకించారు రాఘవేంద్ర రావు. ఆ తర్వాత వరుసగా తన చిత్రాల్లో నటింపజేసి స్క్రీన్ పై ఆమె అందాలను అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకేంద్రుడు. ఆపై ఆమె గోల్డెన్ గర్ల్ గా మారింది. అల్లరి ప్రియుడు, ఘరానా బుల్లోడు, అల్లరి ప్రేమికుడు, హలో బ్రదర్, క్రిమినల్, ముద్దుల ప్రియుడు, బంగారు బుల్లోడు, అల్లుడా మజాకా ఇలా వరుసబెట్టి హిట్స్ ఆమెకు అందాయి.

                      ఇక కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు ఆమె కెరీర్ లో మరో మైలురాయి. గ్లామర్ రోల్స్ చేస్తున్న టైంలోనే అమ్మోరుగా ఆమె తనలోని మరో కోణాన్ని కూడా ఆవిష్కరించింది. దీంతో ఏ క్యారెక్టర్లో అయినా రమ్యకృష్ణ ఒదిగిపోతుందన్న పేరు పడిపోయింది. మధ్యలో అన్నమయ్య, దేవుళ్లులో కనకదుర్గ, నీలాంబరి తదితర భక్తిరస చిత్రాల్లో కూడా ఆమె నటించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ లో నీలాంబరి పాత్ర ఆమె కెరీర్ కే హైలెట్. సూపర్ స్టార్ తో పోటీ పడి ఆమె చేసిన నటనను ఇప్పటికి జనాలు గుర్తుంచుకుని తీరాల్సిందే. సౌత్ లో అందరు అగ్రదర్శకులతో, దాదాపు అందరు అగ్రహీరోలతో నటించిన ఏకైక నటి రమ్యకృష్ణే అని చెప్పొచ్చు.

కెరీర్ సజావుగా సాగుతున్న దశలోనే దర్శకుడు కృష్ణ వంశీతో ప్రేమలో పడిపోవటం, ఆపై పెళ్లి చేసుకోవటం చకచకా జరిపోయాయి. వీరికి రిత్విక్ అనే బాబు ఉన్నాడు. ఇక పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ కి పూర్తిగా దూరమైన రమ్యకృష్ణ, అడపాదడపా గెస్ట్ రోల్స్ చేస్తూ వస్తున్నారు.

ఇక తాజాగా బాహుబలిలో శివగామిగా ఆమె కనబరిచిన నటనకు ప్రేక్షకులు ఏరేంజ్ లో నీరాజనాలు అర్పించారో మనందరికీ తెలుసు. ప్రస్తుతం బాహుబలి పార్ట్ 2 తోపాటు మరో అరడజను చిత్రాల్లో ఆమె నటిస్తుంది. ఆమె మరిన్నీ పుట్టిన రోజులు జరుపుకోవాలని కొరుకుంటూ... హ్యాపీ బర్త్ డే టూ రమ్యకృష్ణ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ