దర్శకుడు శంకర్ బర్త్ డే స్పెషల్

August 17, 2015 | 04:56 PM | 1 Views
ప్రింట్ కామెంట్
south_director_shankar_birthday_niharonline

పెద్ద హీరో, పెద్ద సినిమా, పెద్ద నిర్మాత, పెద్ద చిత్రం. కానీ ఆయన చిత్రాలు స్పెషల్. కమర్షియల్ అంశాలతోపాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఆయనెవరో కాదు భారతీయ చలన చిత్ర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన దర్శకుడు శంకర్. ఈరోజు (ఆగస్ట్ 17న ) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శంకర్ గురించి...

                                  ఆగస్టు 17 న కుంభకోణంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు శంకర్. చిన్నతనం నుంచే చదువంటే శంకర్ కి ఆసక్తి ఉండేది కాదు. అయినా తండ్రి బలవంతం మేరకు చెన్నైలోని సీపీటీ నుంచి డిప్లొమాలో మెకానికల్ ఇంజనీర్ చదివాడు. ఆ తర్వాత  స్టార్ నటుడు, ఇళయదళపతి విజయ్ తండ్రి, దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించాడు. ఎ.ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో జెంటిల్మెన్ లాంటి భారీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. తొలుత రజనీకాంత్ ని ఎంచుకున్నప్పటికీ కొత్త వాడు కావటంతో రజనీ నటించేందుకు నిరాకరించాడట. ఆ రకంగా అదృష్టం అర్జున్ ని వరించి అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ అయిన ప్రభుదేవాతో ప్రేమికుడు తీసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. జీన్స్, భారతీయుడు, ఒకే ఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, స్నేహితుడు,  రోబో, ఐ, ఇలా వరుసగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మెగా మూవీలను అందించాడు. అతని చిత్రాల్లో దాదాపు కోర్టు సీన్లు కామన్. సామాజిక అంశాలను జనాలను హత్తుకునేలా రూపొందించడంలో దిట్ట. ఒకే ఒక్కడుగా ఒక్క రోజు సీఎం పాత్రలో అర్జున్ ని ఆవిష్కరించాడు. అపరిచితుడితో విక్రమ్ ఫేట్ ను మార్చేశాడు. రోబోలో రజనీలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఇలా ఓవైపు మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు సామాజిక అంశాలను కూడా అందించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. అతను తీసిన చిత్రాల్లో ఒకటి రెండు చిత్రాలు తప్ప మిగతావన్నీ ఇప్పటికీ ప్రేక్షకులు టీవీల్లో వచ్చినా వదలరంటే అతిశయోక్తి కాదు. ఓవైపు తమిళ్ తోపాటు తెలుగులో కూడా శంకర్ కి భీభత్సమైన క్రేజ్ ఉంది. దానికి ఈ యేడు వచ్చిన ఐ మూవీ తెలుగు బిజినెస్ నిదర్శనం. రోబో ద్వారా అంతర్జాతీయ చలన చిత్ర స్థాయికి భారతీయ చిత్రాన్ని తీసుకెళ్లడంలో శంకర్ కృషి గణనీయమైనది. ఈ దర్శకుడికి నీహార్ ఆన్ లైన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అందిస్తోంది. హ్యాపీ బర్త్ డే టూ శంకర్ సార్...   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ