హరీష్ పెన్ను-పవన్ గన్ను పడితే... అభిమానులకు అద్భుతహ....

May 11, 2015 | 02:22 PM | 119 Views
ప్రింట్ కామెంట్
pawan_harish_shankar_niharonline

అవును మరి. వాళ్ళిద్దర్నీఇలా చూడాలని వేల మంది ఎదురు చూస్తారు... పవన్ తో పని చేయాలంటే హరీష్ కు కూడా చాలా చా ఇష్టమంటున్నాడు... గబ్బర్ సింగ్ సినిమా తన అభిమాన నటుడు పవన్ తో చేసి తన ఇష్టాన్నంతా సినిమాలో చూపించేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మరోసారి పవన్ చేతికి గన్ను ఇవ్వాలని చాలా ఉబలాట పడిపోతున్నాడు ఆ డైరెక్టరు. తానో గొప్ప డైరెక్టర్ నీ కాదనీ, తన అభిమాన హీరోతో చేయడం వల్ల అలా హిట్ ఇవ్వగలుతున్నానని చెప్పుకుంటున్నాడు ఈ డైరెక్టర్. నిజంగా కూడా పవన్ ఖుషి తరువాత పవన్ అభిమానులను బాగా అలరించిన సినిమా అంటే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ అనే చెప్పుకోవాలి. హరీష్ పెన్ను పట్టుకుని రెడీ అంటే ఈ అభిమాని మాట కాదంటాడా పవన్ కళ్యాణ్..!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ