చిన్నారి మృతికి బాధపడుతూ హేమామాలిని ట్వీట్...

July 08, 2015 | 01:29 PM | 3 Views
ప్రింట్ కామెంట్
hema_malini_chinni_niharonline

మూడు రోజుల క్రితం రాజస్థాన్‌లో హేమమాలిని కారు యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి గాయాలయ్యాయి. కానీ తన కారు ఢీకొన్న మరో కారులో చిన్నారి మృతి చెందడంపై ఆమె తీవ్రంగా కలత చెందారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బుధవారం (జులై 8) ఉదయం హేమమాలిని స్పందించారు. ఈ విషయాన్ని హేమామాలిని తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ప్రమాదంలో అన్యాయంగా ఓ చిన్నారి బలైందని, కొందరికి గాయాలయ్యాయని తెలిపారు. అయితే ఈ కారును నడుపుతున్న చూపకుండా హేమమాలిని అక్కడి నుంచి వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై కూడా హేమ మాలిని బాధ పడ్డారు. ఆ సమయంలో తనకు దెబ్బలు తగిలి, అపస్మారక స్థితిలో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని, ఆ సమయంలో ఆస్పత్రికి ఎలా వెళ్లాలో కూడా తెలియలేదని అన్నారు. అదే సమయంలో ఆస్పత్రిలో ఉన్నప్పుడు తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.వ్యక్తి నిబంధనలు పాటించివుంటే ఓ చిరు ప్రాణం పోయేది కాదని హేమమాలిని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఈ ప్రమాద సందర్భంలో కనీస మానవత్వం కూడా లేకుండా హేమా వెళ్ళిపోయిందన్న కామెంట్లు రావడంపై ఆమె బాధపడుతూ... తనకు ఏం చేయాలో తోచని పరిస్థితి అనీ, అలాంటి స్థితి నుంచి నేను ఎలా బయటపడాలో అర్థం కాలేదని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా డ్రైవర్ పాటించి ఉంటే ఓ చిన్నారి ప్రాణం పోయేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ