రాంచరణ్ కు ’సుప్రీమ్’ సూటవుతుందా?

June 18, 2015 | 12:52 PM | 0 Views
ప్రింట్ కామెంట్
ram_charan_supreem_niharonline

ఒక పక్క సినిమా షూటింగ్ చకచకా జరిగి పోతున్నా ఇప్పటి వరకూ రామ్‌ చరణ్‌ - శ్రీను వైట్ల సినిమాకు ఇంకా పేరు డిసైడ్ కాలేదు. ఈ చిత్రం మొదలైనప్పటినుంచీ దీనికి 'మై నేమ్‌ ఈజ్‌ రాజు' అనే పేరు పెడుతున్నారనీ.... కాదు కాదు బ్రూస్ అనీ.... వార్తలు మాత్రం వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు వర్కింగ్‌ టైటిల్‌గా మైనేమ్ రాజు అంటున్నారు. కానీ ఇప్పటి వరకూ ఏ టైటిల్ ఫిక్స్ కాలేదు. ఈ చిత్రంలో చరణ్‌ స్టంట్‌మేన్‌గా నటిస్తున్నాడు కాబట్టి  బ్రూస్ లీ టైటిల్‌ బాగుంటుందని అనుకున్నారు... కానీ ఆ టైటిల్‌ కూడా అందరికీ నచ్చకపోవడంతో మరో టైటిల్ కోసం వెతుకులాట మొదలు పెట్టారు. అయితే తాజాగా చరణ్‌ 'సుప్రీమ్‌' అనే టైటిల్‌ వైపు మొగ్గు చూపుతున్నాడనే వార్త వినిపిస్తోంది. చిరంజీవికి మెగాస్టార్‌ బిరుదు ఇవ్వకముందు సుప్రీమ్‌ హీరో అని పిలిచేవారు. దానినే ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టాలని అనుకుంటున్నారని, ఈ టైటిల్‌పై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారని సమాచారం. అటు మాస్‌ని, ఇటు క్లాస్‌ని కూడా ఆకట్టుకునేలా ఈ చిత్రం టీం ఆలోచన. సుప్రీమ్ అన్ని విధాలా అందరికీ నచ్చే విధంగానే ఉన్నట్టు పాజిటివ్ టాక్స్ వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన విడుదలయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ