ప్రిన్స్ హీరోగా ప్రారంభమైన 'పెళ్లికి ముందు ప్రేమకథ'

June 27, 2015 | 05:58 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Pelliki_Mundu_Prema_Katha_niharonline

యంగ్ హీరో పిన్స్ హీరోగా వేదాద్రి ఫిలింస్ సమర్పణలో 9 స్టార్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన చిత్రం జూన్ 27న హైదరాబాద్ లో ప్రారంభమైంది. మధు గోపు దర్శకుడు. సుధాకర్ పట్నం, నాగేశ్వరరావు సిహెచ్.వి నిర్మాతలు. ముహుర్తపు సన్నివేశానికి అల్లరి నరేష్ క్లాప్ కొట్టగా, అనంత్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత మార్కాపురం శివకుమార్ ముహుర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్, సునైన, ఆశ్విని, సంగీత దర్శకుడు యాజమాన్య, నిర్మాతలు, దర్శకుడు సహా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఒక వ్యక్తి ప్రేమ సక్సెస్ కావడానికి అతను తీసుకునే నిర్ణయాలే కారణం. హీరో మరి తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏం చేశాడనేదే కాన్సెప్ట్ అని దర్శక, నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి ఆర్ట్: బాబ్జీ, ఎడిటింగ్: జునైద్, సినిమాటోగ్రఫీ: రవికుమార్, సంగీతం: యాజమాన్య, స్క్రీన్ ప్లే: సుధాకర్ పట్నం, నిర్మాతలు: సుదాకర్ పట్నం, నాగేశ్వరరావు సి.హెచ్.వి, రచన-దర్శకత్వం: మధు గోపు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ