సింగరైన సురేష్ గోపీ తనయ

January 12, 2015 | 05:44 PM | 20 Views
ప్రింట్ కామెంట్

ఒకప్పుడు హీరోల కొడుకులు మాత్రమే సినీ రంగప్రవేశం చేశారు. కానీ ఇప్పుడు అమ్మాయిలను కూడా సినిమాల్లో నటింపచేస్తున్నారు. కమల్ హాసన్ ఇద్దరు కూతుర్లు సినిమాల్లో నటిస్తున్నారు. అర్జున్, శరత్ కుమార్ కూతుర్లు కూడా సినీ యాక్ట్రెస్ లయిపోయారు. తాజాగా మరో స్టార్ హీరో అయిన సురేష్ గోపీ కూతురు భాగ్య కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. అయితే నటిగా కాదు సింగర్‌గా. పాడ్డమే కాదు రాస్తుంది కూడా. మ్యూజిక్ కంపోజర్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. త్వరలో రాబోతున్న మళయాల సినిమా ‘Jo We Lo'కు ఇంగ్లీష్ పాట రాసింది. ఈ చిత్రానికి శ్యాం ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తనలోని టాలెంటును ప్రోత్సహిస్తూ వెన్నుతట్టుతున్నారని.....వారి సహకారంతో తన శక్తిమేర రాణించడానికి ప్రయత్నిస్తాను అంటోంది భాగ్య.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ