వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగు ప్రేక్షకుల్లో బాగా గుర్తుంపు పొంది రకుల్ ప్రీత్ సింగ్ వరుస హిట్లతో బాగా పాపులర్ అయిపోయింది. ఢిల్లీకి చెందిన ఈ చిన్నది మొదట ’యారియాన్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఆ తరువాత కన్నడ, తమిళ్, తెలుగు అన్నీ చుట్టి వచ్చేసింది. ఇప్పుడు మరో హిందీ సినిమా రమేష్ సిప్పీ సినిమా‘సిమ్లా మిర్చి’లో నటిస్తోంది. అయితే తన అభిమాన నటి, అలనాటి డ్రీమ్ గర్ల్ తో నటించడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. తనకు హేమా మాలినితో నటించే అదృష్టం దక్కిందని మురిసిపోతోంది. ‘నా చిన్నప్పుడు హేమాజీ సినిమాలు చూసి ఆమె అందానికి ఆశ్చర్య పోయేదాన్ని.. ఆమెతో కలిసి నటిస్తానని కలలోనైనా ఊహించలేదు.. కానీ ఆ కల ఇప్పుడు నిజమైంది‘ అని తెలిపింది రకుల్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సిమ్లాలో జరుగుతోంది. హేమామాలినితో డాన్స్ కూడా చేస్తోందట. ఈ చిత్రంలో హేమ కూతురిగా రకుల్ నటిస్తోంది. తెలుగులో కూడా ఎన్టీఆర్ తో ఒక సినిమా, రవితేజతో ‘కిక్ 2’లో, రామ్ తో ‘పండగ చేస్కో’ లో నటిస్తూ అన్ని భా షల్లో కుమ్మేస్తోంది రకుల్.