‘బాహుబలి' చిత్రం చిక్కట్ల అమ్మకాల్లో అవకతవకలు అరకమాలు జరుగుతున్నాయంటూ బుధవారం ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. ఈ వాజ్యాన్ని నరసింహ రావు అనే వ్యక్తి దాఖలు చేశాడు. దీన్ని హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ వాజ్యంలో బాహుబలి టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఒక పథకం ప్రకారం సినిమాపై హైప్ పెంచారనీ, దీంతో అభిమానులు టికెట్ల కోసం గొడవలకు దిగుతున్నారనీ, అధిక రేట్లకు కొంటున్నారని తెలిపారు. గతంలో మగధీర చిత్రానికి సంబంధించి ఇదే విధంగా జరగడంతో ఏడుగురు మరణించారని, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రేక్షకుల ప్రాణాలకు ప్రమాదం ఉండే అవకాశం ఉందని పిల్ లో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రదర్శనకు పరిమితులు విధించాలని పిటీషన్లో పేర్కొన్నారు.