తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు కాలం కలిసి రాదనే ఉదాహరణలు కోకోల్లలు. బిందు మాధవి, శ్రీ దివ్య, కలర్స్ స్వాతి, అంజలి మొదలైన వారు టాలీవుడ్ లో వేగ లేక కోలీవుడ్ కు వెళ్లి అక్కడ రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్లు అయిపోయారు. మరి ఇక్కడ హీరోయిన్ల పరిస్థితి ఏంటి. పరభాషల నుంచి వచ్చి ఇక్కడ రాజ్యమేలుతున్నారు. సమంత, కాజల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఒక్కోక్కరు ఒక్కో ప్రాంతం నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. కాస్త గ్లామర్ టచ్ ఉంటే చాలని చెలరేగిపోతున్నారు. అయితే తాజాగా కొన్ని చిత్రమైన పరిస్థితులు టాలీవుడ్ లో చోటు చేసుకున్నాయి. అదే హిందీ సీరియల్స్ పభావం. హిందీ సీరియల్స్ లో నటీమణులు ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లు గా పాగా వేసేందుకు రెడీ అయిపోతున్నారు. సోనారిక, అవికాగోర్, ఉల్కా గుప్తా ప్రస్తుతానికి ఈ ముగ్గురు. ఇందులో అవికాగోర్ తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచతమే. చిన్నారి పెళ్లి కూతురంటూ డబ్బింగ్ సీరియల్ ద్వారా ఇక్కడి వారిని పలకరించింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో ఉయ్యాల జంపాల అంటూ హిట్ కొట్టేసి, లక్ష్మీ రావే మా ఇంటికి అంటూ పలకరించింది. ప్రస్తుతం ఓ రెండు మూడు ప్రాజెక్టులతో బిజీ అయిపోయింది. ఇక ఈ వరుసలో తర్వాతి అమ్మాయి ఉల్కా గుప్తా పాపులర్ సీరియల్ ఝాన్సీ లక్ష్మీ భాయ్ లో బాల ఝాన్సీగా అలరించిన అమ్మాయి ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ తో ఆంధ్రాపోరిగా రాబోతుంది. అంతేకాదు అదే టైంలో మరో చిత్రాన్ని పట్టేసినట్టు సమాచారం. చివరగా సోనారిక. హరహర మహదేవ్ సీరియల్ లో పార్వతి క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి అనూహ్యమైన అభిమానులను సంపాదించుకుంది. అందం, నటనతో పాటు విపరీతమైన హాట్ నెస్ ఉన్న ఈ బ్యూటీ నాగశౌర్య సరసన జాదుగాడు చిత్రంలో నటించింది. అంతేకాదు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించే చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. అంతేకాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన బోయపాటి చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు గాసిప్స్ వినవస్తున్నాయి. ఇదండీ హిందీ సీరియళ్ల రాణుల కథలు.