బాహుబలి ట్రైలర్ చూస్తుంటే ఇది మన తెలుగు సినిమానా? లేక హాలీవుడ్ సినిమానా అనే విధంగా ఉంది. ట్రైలర్ చూస్తున్నంత సేపూ నాని చెప్పినట్టు గూజ్ బమ్స్ వచ్చేసాయి. ప్రతీ సెకండ్ లో సినిమా రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇది మన తెలుగు వాళ్ళు తీసిన మన తెలుగు సినిమా అనుకుంటే చాలా గర్వంగా... మనసంతా ఉబ్బితబ్బిబ్బైపోతోంది. తమన్నా కనిపించిన సీన్ నిజంగా దేవకన్య దిగివచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. బాహుబలిని చూడగానే ఆమె పరుగు తీసిన తీరు జలపాతాన్ని పోలినట్టుంది. ఆ విగ్రహాలు, ఆ రాజ ప్రాసాదాలు, సైనికులూ, గుర్రాలు, ఏనుగులు... ఏదో లోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. విలనీగా భల్లాల దేవుడి అరుపులు దరపుట్టిస్టున్యి. ఏనుగుల ఘీంకారాలు, సైనికులు పరుగులు..... ఓహ్ ఎంత అద్భుత దృశ్య కావ్యం... అది... కూడా ఈ కాలంలో తీయడం.... అతి గొప్ప హిస్టారికల్ మూవీ ఇది... ‘‘మీ కళ్ళు నన్ను దేవుడిలా చూస్తున్నాయి’’ అన్న ప్రభాస్ భారీ డైలాగ్ ఆ వెంటనే ‘‘నేను ఎవరినీ?’’ అన్న ప్రభాస్ ప్రశ్న, ‘‘మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తానివి నువ్వు’’ అన్న నాజర్ సమాధానం... ‘‘జై మాహిస్మృతే’’ అన్న భల్లాలదేవ ఘీంకారం, భీకర యుద్ధానికి సంబంధించిన కొన్ని సీన్లు, ప్రభాస్, రానాలు శత్రుసైన్యాలపై విరుచుకు పడడం వంటి సీన్లు అద్భుతం. చివరిగా, ఓ నదిలో నిండా మునిగిపోయిన స్థితిలో కూడా చిన్నారిని ఒక చేత్తో మోస్తూ వస్తున్న వ్యక్తి దృశ్యంతో ట్రైలర్ ముగుస్తుంది. యాంగ్జైటీ, సస్పెన్స్ తో ముగించారు ట్రైలర్.... రెండు మూడేళ్ళ శ్రమంతా ఈ ట్రైలర్ లోనే కనిపిస్తుంది... ఇక సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో....? తప్పదు... జులై 10 వరకూ వెయిట్ చేయాల్సిందే...