ప్రియమైన నీకు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హోమ్లీ ఉమన్ స్నేహ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి, 2012లో తమిళనాడుకు చెందిన ప్రసన్నను పెళ్ళి చేసుకుంది. తల్లి కాబోతున్న స్నేహ సీమంతం గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ విషయాన్ని స్నేహ భర్త, నటుడు ప్రసన్న ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు. దీనికి సినీ పరిశ్రమ పెద్దలు హాజరై ఆమెకు ఆశీస్సులు అందించారు. ఈ వేడుకకు టాలీవుడ్ హీరోయిన్ కాజల్ కూడా హాజరయ్యారు. కంచిపట్టు చీరలో , బంగారు నగలతో స్నేహ మెరుపు తీగలా మెరిసిపోతోంది. ’సమయం లేకపోవడం వల్ల ఈ ఫంక్షన్ కు అందర్నీ ఆహ్వానించలేకపోయాను, క్షమించాలి... మీ అందరి ఆశీస్సులు మాకు తప్పకుండా ఉంటాయి. అది నాకు తెలుసు' అంటూ స్నేహ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు , తమిళం, మళయాళం భాషల్లో పెద్ద హీరోల సరసన హీరోయిన్‌గా హీరోయిన్ గా నటించిన స్నేహ స్నేహి తెలుగులో నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి.