వైట్ల తరువాతి సినిమా ప్రభాస్ తో...

June 19, 2015 | 03:20 PM | 0 Views
ప్రింట్ కామెంట్
srinuvytla_prabhas_next_movie_niharonline

బాహుబలితో రెండున్నరేళ్ళు ఫైట్ చేసిన ప్రభాస్ సినిమా చూడ్డానికి జులై 10 కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. బాహుబలి బడలిక తీరనైనా లేదు ఆయన తరువాత చేయబోయే చిత్రం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. బాహుబలి పూర్తవ్వగానే పెదనాన్న కృష్ణం రాజు దర్శకత్వంలో ’ఒక్క అడుగు’ ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది కొన్నాళ్ళు. కానీ ఆ విషయమై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. మధ్యలో అదే కథను మచ్చ రవి ‘ఆటో జానీ’గా మార్చేశాడని వదంతులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ కథలు వినే పనిలోనే ఉన్నాడు. అప్పట్లో రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ దానికి ఇంకా సమయం పడుతుందట. ఇలా ఆ కథలు, ఈ కథలూ, డైరెక్టర్లు మారుతూ మారుతూ ఒక చోట ఆగిపోయాడంటున్నాడు ప్రభాస్. ఇప్పుడు ఆయన శ్రీనువైట్ల లైన్లోకి వచ్చాడట. శ్రీను ఇప్పటికే చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వకముందే ప్రభాస్ తో ఓ భారీ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా సుజిత్ తో సినిమా కంటే ముందే ఉంటుందట... కాస్టింగ్ వివరాల గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ