కంప్యూటర్ల కాలం వచ్చేశాక సోగ్గాడి పదం వాడుకలో తగ్గింది గానీ అప్పట్లో సినిమాల్లో ఈ పదం బాగా వాడేవారు. నాగార్జున రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’ టైటిల్ ఓ పాత పాట మొదటి లైన్ నుంచి తీసుకున్నారు. ఈ సినిమాలో నాగార్జున డ్యుయెట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు విడుదలైన పోస్టర్ లో నాగార్జున రమ్యకృష్ణల పోస్టర్లు ఎన్నో పాత సినిమాలను గుర్తు చేస్తున్నాయి. నాగార్జున నటించిన అల్లరి అల్లుడు, శోభన్ బాబు నటించిన సోగ్గాడి గెటప్, ఓ పల్లె సీమ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇది అన్ని రకాల ప్రేక్షకులు చూసే కుటుంబ కథా చిత్రంగా అనిపిస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సన్‌షైన్ సినిమాస్ ప్రై. లి. పతాకాలపై నాగార్జున, రామ్మోహన్ పి. సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా కల్యాణ్‌కృష్ణ పరిచయమవుతున్నారు. ఇందులో టీవీ యాంకర్ అనసూయ కూడా ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.