బుల్లితెరపై చిట్టిపొట్టి బట్టలతో యాంకరింగ్ కే ఓ కొత్త కళను తెచ్చిన యాంకర్ ఆమె. ఇక ఈమె టాలెంట్ ను గుర్తించిన చాలామంది సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. ఏకంగా పవన్ కళ్యాణ్ చిత్రంలో (అత్తారింటికి దారేది) ఓ ఐటెంసాంగ్ కి ఆమెకి అవకాశం వచ్చినప్పటికీ వదిలేసుకుంది. ఆ తర్వాత గోపాల గోపాల లో కూడా జర్నలిస్ట్ (మధుషాలిని చే చేయించారులేండీ) పాత్రకి అడిగితే నో చెప్పింది. ఐటెంసాంగ్ లు చేస్తే కెరీర్ దెబ్బతింటుందని, జర్నలిస్ట్ పాత్ర తన ప్రోఫెషన్ కి దగ్గరగా ఉంటుందనే కారణాలతో రిజెక్ట్ చేసినట్లు ఆమె వివరణ ఇచ్చుకుంది. ఇలా వచ్చిన ఆఫర్లను వచ్చినట్టే రిజెక్ట్ చేసింది. అయితే సడన్ గా ఎమైందో తెలీదు కానీ, ఇప్పుడు మనస్సు మార్చుకుందట. ఇందుకోసం స్టార్ హోటళ్లలో బడాబడా నిర్మాతలతో మీటింగ్ పెట్టి మరీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుందని తెలియవస్తోంది. అంతేకాదు ఇఫ్పటికే ఓ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కాళ్ల దాకా వచ్చిన అద్రుష్టాన్ని వద్దనుకుని ఇఫ్పుడేమో ఇలా ఆశగా అవకాశాల కోసం ఎదురుచూస్తోందట మన యాంకర్ ఆంటీ. ఆల్ ది బెస్ట్ అనసూయ.