గురువారం అంత్యక్రియలు

February 18, 2015 | 05:32 PM | 29 Views
ప్రింట్ కామెంట్
movie moghal ramanaidu_niharonline

రామానాయుడు బుధవారం మధ్యాహ్నం చనిపోగా, ఆయన అంత్యక్రియలు రేపు జరగనున్నట్టు కుమారుడు హీరో వెంకటేష్ వివరించారు. బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చి తన తండ్రి రామానాయుడు మరణించిన విషయాన్ని ప్రకటించారు. తండ్రి ప్రశాంతంగా కన్ను మూశారని తెలిపారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు నాన్నగారు తుది శ్వాస విడిచినట్లు ఆయన తెలిపారు. రేపు గురువారం ఉదయం 9 గంటల నుంచి రామానాయుడి స్టూడియోలో అభిమానుల దర్శనార్థం నాన్నగారి భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. రేపు సాయంత్రం 3 గంటల తర్వాత అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. కాగా, రామానాయుడి స్వగ్రామం కారంచేడు నుంచి బంధువులు, అభిమానులు హైదరాబాదుకు బయలుదేరారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ