ఛాన్స్ దొరికితేచాలు ఈ మధ్య సెలబ్రిటీల పేరిట నకిలీ మెయిళ్లను క్రియేట్ చేయటం, మరీ వీలైతే ఏకంగా వారి అకౌంట్లనే హ్యక్ చేయటం ఆకతాయిలకు అలవాటుగా మారింది. తాజాగా ఈ బాధిత జాబితాలో బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ చేరిపోయాడు. హృతిక్ పేరు మీద ఎవరో నకిలీ మెయిల్ ను సృష్టించటంతోపాటు తన స్నేహితులకు మెయిళ్లు కూడా పంపుతున్నారట. దీంతో కాలిన హృతిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. hroshan@email.com పేరిట ఎవరో ఈమెయిల్ క్రియేట్ చేసి తన ఫ్యాన్స్ తోపాటు ఫ్రెండ్స్ కి కూడా మెయిల్స్ పంపుతున్నాడని. వెంటనే ఆ నకిలీ అకౌంట్ ను బ్లాక్ చేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్న ఓ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అవకాశం కోసం ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి తన నగ్న చిత్రాలను ఆ మెయిల్ ఐడీకి పంపిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో విషయం తెలుసుకున్న హృతిక్ అవాక్కయి పోలీసులను ఆశ్రయించాడు.