ఇటీవల వైజాగ్ లో జరిగినా హుధ్ హుద్ వైపరీత్యానికి సహాయంగా టాలీవుడ్ సినీ తారలంతా కలిసి చేసిన మేముసైతం కార్యక్రమంలో కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తీలుకూడా స్పందించి తమ వంతు సహాయాన్ని అందించారు. సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా లింగా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందనీ, రావడం కుదరలేదనీ అయినా తన సహాయం అందిస్తానని మాట ఇచ్చారు. అది ఇప్పుడు ప్రకటించి 5 లక్షల రూపాయిలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహయ నిధికి చెక్ ని పంపించారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కూడా అభిమానులు కోలీవుడ్ స్థాయిలో ఉన్నారు. అక్కడి హీరోలు సూర్య, కార్తీలు వెంటనే స్పందించి వారి ఫామిలీ తరఫు నుంచి 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇంత పెద్ద హీరో అయి ఉండి అది కూడా ఇండియా స్థాయిలో అభిమానులున్న పెద్ద హీరో 5 లక్షలు మాత్రమే ఇవ్వడంపై రజనీ అభిమానులు తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు.