పీకేతోపాటు సీక్వెల్ పై చర్చలు

December 20, 2014 | 03:18 PM | 41 Views
ప్రింట్ కామెంట్

నిన్న విడుదలైన పీకే సినిమా గురించి దేశవ్యాప్తంగా ఒకటే చర్చలు. సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై చాలా స్పందించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచే సినిమా ఇదని తీర్పిస్తున్నారంటే ‘పీకే’ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘‘మీ జీవితంలో అద్భుతమైన విషయాలేమీ ఇంకా జరగలేదా? ఐతే పీకే చూడండి’’ అంటూ అమీర్ సినిమాను ఏ మొహమాటం లేకుండా ప్రమోట్ చేశాడు. సౌత్ ఇండియన్ సెలెబ్రెటీస్ కూడా పీకే చూడకపోతే చాలా కోల్పోయినట్లే అని అంటున్నారు. ‘‘పీకే చూశా. మనసు నిండిపోయింది. రాజ్ కుమార్ హిరాని బెస్ట్ వర్క్ ఇదే. అమీర్ ఖాన్.. దేవుడి గొప్ప క్రియేషన్’’ అని సమంత ట్వీట్ చేయగా.. ‘‘పీకే.. హిరాని మాస్టర్ పీస్. ఈ అనుభూతిని వర్ణించడానికి మాటలు రావట్లేదు. 5కు వంద రేటింగ్స్ ఇస్తా’’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. పీకే చూసి మతి పోయిందని మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ట్వీట్ చేశాడు. మొత్తానికి ఎటు చూసిన ‘పీకే’పై ప్రశంసల వర్షమే కురుస్తోంది. పీకే చూసిన ప్రతి ప్రేక్షకుడూ ఎన్నో అనుభూతులతో బయటికి వస్తున్నాడు. అయితే ఇంత వరకూ వచ్చిన అమీర్ సినిమాలన్నీ ఒక మెసేజ్ తో కూడుకున్నవయితే ఈ సినిమాలో మాత్రం మొత్తం అమీర్ చుట్టూ తిరుగుతున్నట్టుంది. మెయిన్ కంటెంట్ ఏమిటన్నది ఒక ప్రశ్న కాగా, గ్రహాంతరవాసిగా అమీర్ నటన అద్భుతంగా ఉంది. ఆయన నటన చూడ్డం కోసం ఈ సినిమా చూడాలి. అయితే క్లై మాక్స్ లో రణ్ బీర్ ఎంటర్ అవడంపై మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్గా మరో చిత్రం కూడా రూపొందనుందనీ, అందులో రణ్ బీర్ కథానాయకుడిగా నటించవచ్చుననుకుంటున్నారు. రెండో గ్రహాంతరవాసిగా రణ్బీర్ కనిపిస్తాడు. రాజ్కుమార్ హిరాణీ ఇదివరకు కూడా మున్నాభాయ్ సిరీస్లో రెండు సినిమాలు తీశాడు. అదే తరహాలో పీకేని కూడా రెండు మూడు చిత్రాలుగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ