వామ్మో! ఆ సినిమా కోసం వందఎకరాల సెట్టా?

March 05, 2016 | 03:32 PM | 4 Views
ప్రింట్ కామెంట్
arya-catherine-tresa-huge-village-set-niharonline

సినిమాల కోసం భారీగా ఖర్చుపెట్టి, ఎంతదాకైనా వెళ్తున్నారు ఇప్పుడున్న మన నిర్మాతలు. అలాంటిది ఓ సినిమా కోసం ఏకంగా వంద ఎకరాలలో సెట్ వేసేస్తున్నారు. కొంపదీసి ఇది బాహుబలి-2 కోసం అనుకుంటున్నారేమో కాదండీ. ఓ కోలీవుడ్ సినిమా కోసం ఇదంతా...

తమిళ్ లో ఆర్య - కేథరిన్ నాయకా నాయికలుగా ఒక సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మించబడుతోన్న ఈ సినిమా, త్వరలో ప్రారంభం కాబోతోంది. అందుకు అవసరమైన భారీ సెట్ ను తమిళనాడు దిండుగల్ జిల్లా 'తాండికుడి' అనే గ్రామంలో వేస్తున్నారు. గిరిజన తండా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

అక్కడి 100 ఎకరాల ఖాళీ ప్రదేశాన్ని ఈ సినిమా షూటింగ్ కోసం ఎంచుకున్నారట. ఈ సెట్ పూర్తికాగానే ఫస్టు షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. షూటింగ్ కోసం ఈ సినిమా టీమ్ 100 ఎకరాల స్థలాన్ని ఎంచుకోవడం కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతగా ఈ సినిమాలో ఏం ఉండబోతుందా అని ఇప్పటి నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ