మలయాళంలో ఘన విజయం సాధించిన బెంగళూరు డేస్ ను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా చిక్కుల్లో పడిందంటున్నా. కారణం ఈ చిత్రానికి పెట్టిన టైటిలే అని తెలుస్తోంది. ఫ్రెండ్షిప్ నేపథ్యంతో బాబీసింహా, ఆర్య, రానా, శ్రీదివ్య, రాయ్‌లక్ష్మీ, పార్వతి మేనన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పెట్టిన ఏడీఎంకే టైటిల్‌తో చిక్కొచ్చి పడింది. కథలో కీలకపాత్రధారుల పేర్లలోని మొదటి అక్షరాలతో ఏడీఎంకే (అర్జున్, దివ్య మట్రుమ్ కార్తిక్) టైటిల్ పెట్టారు. అయితే ఇది తమిళనాడులోని ఒక ప్రధాన రాజకీయపార్టీని స్ఫురిస్తుండడంతో వివాదం తలెత్తింది. తాజా సమాచారం మేరకు ఏడీఎంకే టైటిల్ కోసం నిర్మాతలు సదరు పార్టీ నేతల వద్ద అనుమతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఏడీఎంకే టైటిల్‌పై దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా పూర్తి సంతృప్తిగా లేరని మరో కథనం వినిపిస్తోంది. దీంతో అనవసర తలనొప్పులు ఎందుకని టైటిల్ మార్చేందుకే యూనిట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపు బెంగళూరు డేస్ తమిళ రీమేక్ టైటిల్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.