విజువల్ ఎఫెక్ట్స్ లో హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోమని ఇటీవల బాహుబలి తో ప్రపంచానికి చాటాడు జక్కన్న. భారీ వ్యయంతో, అదే రేంజ్ గ్రాఫిక్స్ తో తెరకెక్కించి ప్రపంచం చూపు మనవైపు తిప్పుకునేలా చేశాడు. భారీ వసూళ్లు రాబట్టగలిగాడు. అయితే ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ కి పనిచేసింది మాత్రం జురాసిక్ వరల్డ్ కి పనిచేసిన టెక్నిషియన్స్. సో ఆ క్రెడిట్ అంతా వారికే వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలలో భారతీయుల పనితనం గురించి మాట్లాడుకునే సమయం వచ్చింది. ట్రామ్ కూజ్ మిషన్ ఇంపాజిబుల్ మిషన్ ఇంపాజిబుల్ చిత్రం ఇటీవలె విడుదలయ్యింది. దీనికి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ధీరేంద్ర ఛాట్ పర్, డిజిటల్ కంపోజిటర్లుగా సౌరభ్ నందేడ్కర్.. అభిషేక్ సింగ్ లు పనిచేశారు. ఈ చిత్రం జులై 30న అమెరికాలో విడుదలై, గురువారం స్పెషల్ షోలతో ఇక్కడా విడుదలైంది. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాకు విజువుల్ ఎఫెక్ట్సే హైలెట్ గా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ధీరేంద్ర ఛాట్ పర్ భజరంగీ భాయిజాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించటం ఒక విశేషం. అలాగే హమారి అధూరి కహాని.. తనూ వెడ్స్ మను చిత్రాలకూ ఆయనే విజువల్ ఎపెక్ట్స్ అందించారు. సౌరభ్ నందేడ్కర్.. అభిషేక్ సింగ్ లు గతంలో బర్ఫీ, ఏబీసీడీ, బాగ్ మిల్కా బాగ్ సౌరభ్ చేస్తే.. దబాంగ్ 2.. హౌస్ పుల్ 2 చిత్రాలకు భట్టాచార్య పని చేశారు. ఇక్కడే కాదు మనోళ్లు హాలీవుడ్ లో కూడా మన పనితనం చాటుతూ పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారన్నమాట.