సన్ ఆఫ్ సత్యమూర్తిలో స్పెషల్ క్యారెక్టర్ కోసం ఉపేంద్రను టాలీవుడ్ కు లాక్కొచ్చారు మన త్రివిక్రమ్. కానీ ఈ హీరో ఏ ప్రత్యేకతలేక పోతే చేసే రకం కాదట ఈ కన్నడ హీరో. నచ్చితేనే సినిమాలు చేస్తాడు. ఉపేంద్రకి నచ్చాలంటే ఆ కథలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉండాలి. ఏ హీరోకి అయినా సక్సెస్, ఫెయిల్యూర్ తప్పవు. కానీ ఉపేంద్ర ఏ సినిమా చేసినా అందులో అతని పాత్ర డిఫరెంట్‌గానే ఉంటుంది. నిజానికి శ్రీహరి స్థానాన్ని బర్తీ చేయడానికి ఈ హీరోని ఇక్కడకు తీసుకు వచ్చారట. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమా వచ్చాక ఇతన్ని తమ సినిమాల్లోకి తీసుకోవాలనే ఆలోచన చాలా మందికి వచ్చిందట. కానీ ఈయన ఏ ప్రత్యేకతా లేనిది ఒప్పుకోడు కదా.... ఈ హీరో తెలుగులో ఇంతకు ముందే నటించాడు ( 'కన్యాదానం', 'టాస్'). ఈ రెండు సినిమాల్లోనూ ఆయనవి ప్రత్యేక పాత్రలే. సన్ ఆఫ్ తరువాత వచ్చిన ఆఫర్లను మొహమాట పడి ఒప్పుకోకుండా... ఆలోచించి చెప్తానంటున్నాడట. ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో అతని ఎంట్రీ సీన్ చెబుతుంది. అందుకే ఈ కన్నడ హీరోకి అంత డిమాండ్.