ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఓ వెలుగు వెలిగి, తదనంతరం కుర్రహీరోల ధాటికి కోట్టుకుపోయిన వాళ్లలో జగపతి బాబు ఒకడు. అయితే రియల్ స్టార్ మరణంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ స్టార్ గా బిజీ అయిపోతున్నాడు జగ్గూభాయ్. బాలయ్య లెజెండ్ లో, పిల్లా నువ్వులేని జీవితంలో నెగటివ్ రోల్ లో అలరించిన ఆయన ఆ తర్వాత శ్రీమంతుడిలో ఏకంగా సూపర్ స్టార్ తండ్రి పాత్రలో నటించి మెప్పించాడు కూడా. ఇక సోలో హీరోగా ఇక చిత్రాలు చేయడా మరి అనుకుంటున్న సమయంలోనే విప్లవ్ కుమార్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో హితుడు అనే సినిమాలో హీరోగా నటించాడు.
నిజానికి హితుడు సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం శుక్రవారం (డిసెంబర్ 11న) విడుదలైందట. సినిమా విషయానికొస్తే ఇందులో సీతారాం అనే క్యారెక్టర్ లో జగపతి బాబు కనిపించినట్లు సమాచారం. నక్సలైట్ జీవితం నుంచి జనజీవన స్రవంతిలో కలిసి తన ఊరిని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే పాత్రలో కనిపిస్తాడు. అక్కడే అభిలాష(మీరానందన్) అనే గిరిజన అమ్మాయి చదువు కోసం ప్రయత్నిస్తూంటే, ఊరి పెద్దలు అడ్డుతగులుతూ ఉంటారు. మరి ఆమె చదువు కొనసాగేందుకు సీతారాం చేసే ప్రయత్నమే ఈ చిత్రకథ. స్టోరీ, డైలాగులు, సహజంగా నటించిన ఆర్టిస్టుల ఫర్ ఫార్మెన్స్ ఫ్లస్ లుగా ఉన్నప్పటికీ, స్ర్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవటం, మరీ సాగదీసినట్లుగా ఉండటం ఈ చిత్రానికి నెగటివ్ పాయింట్లు. మరి ఓ టైప్ ఆఫ్ సినిమాల మోజులో ఉన్న మన ప్రేక్షకులు దీనిని అంతగా పట్టించుకుంటారా?