శోభన్ బాబు తరువాత ఇద్దరేసి హీరోయిన్లతో రొమాన్స్ చేసిన నటుడంటే జగపతి బాబునే చెప్పుకోవాలి. అల్లరి బుల్లోడు, శుభలగ్నం, ఆయనకిద్దరు, మావి చిగురు, జాబిలమ్మ పెళ్ళి, శుభాకాంక్షలు తదితర చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్లతో నటించాడు. అయితే ఆయన నటించిన సినిమాలను గుర్తు చేసుకుంటూ ట్రెండ్ మారిపోయిందనీ, అప్పటి సినిమాలకూ, ఇప్పటి సినిమాలకూ చాలా తేడా కనిపిస్తోందని అంటున్నాడు. విలన్ నుంచి తండ్రి పాత్రలకు దిగిపోయిన జగపతి బాబు ఇప్పుడు నటించిన శ్రీమంతుడు ప్రచారం మొదలెట్టేశాడు. టీజర్ చూస్తే తండ్రీ కొడుకుల ఆలోచన విధానంలో తేడా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే సినిమాలో మహేష్ అద్భుతంగా నటించాడనీ, నటనలో పెర్ఫెక్షనిస్ట్ అనీ ప్రతిదీ పక్కాగా వచ్చేవరకూ వదిలిపెట్టడనీ చెపుతో మహేష్ తో కలిసి నటించడం హాపీగా ఉందన్నాడు. వయసుడిగిన తండ్రిలా నటించడం తెల్లగడ్డం గడ్డం, జుట్టుతో కనిపించడం గురించీ మాట్లాడితే... ఇప్పుడు తన వయసు 53అనీ, వయసుకు తగిన పాత్రలు చేస్తున్నానని అన్నాడు. పాత్రల్ని బట్టి విమర్శలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయనీ, అప్పట్లో గాయం లాంటి యాక్షన్ సినిమాల్లో చేశాను, ఆయన కిద్దరు, శుభాకాంక్షలు, శుభలగ్నం లాంటి ఫ్యామిలీ సినిమాల్లోనూ నటించాను. గాయం లాంటివి చేయడం లేదెందుకు అన్నారు. మధ్యలో గాయం 2 కూడా చేశాను అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయనికిద్దరు, శుభలగ్నం లాంటి ఇద్దరు హీరోయిన్ల సినిమాలను చేయాలని ఉందని తన మనసులోని మాట బయట పెట్టారు. వయసు పైబడిందంటూనే మళ్ళీ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ ఎలా చేస్తారు? అంటే శోభన్ బాబు ‘ఏమండీ ఆవిడ వచ్చింది’ లాంటి సినిమాల్లో చేస్తారేమో మరి.