ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రకుల్ ప్రీత్‌సింగ్ నాయిక. ఈ సినిమాలో రకుల్ తండ్రిగా జగపతిబాబు నటించనున్నారు. ఆ మధ్య యువ హీరోలకు తండ్రిగా నటించడం మొదలుపెట్టిన జగపతిబాబు ఈ సినిమాలోనూ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బీవీయస్‌యన్ ప్రసాద్ నిర్మాత.