నటుడు, సింగర్ గీతామాధురి భర్త అయిన నందు తాజాగా విలన్ అవతారమెత్తనున్నారు. ఇంతకు ముందు రభస, ఆటోనగర్ సూర్య వంటి సినిమాల్లో నెగటివ్ ఛాయలున్న పాత్రలు పోషించిన నందు తాజా సినిమాలో పూర్తి స్థాయి విలన్గా నటించబోతున్నారు. నవనీత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి నందు మాట్లాడుతూ ``మంచి వాడిగా నటిస్తున్నానా? చెడ్డవాడిగానా అని నేనెప్పుడూ ఆలోచించను. కథ బావుందా లేదా? అందులో నా పాత్ర ఎలా ఉంది? అనే దాని మీదే నా ఏకాగ్రత ఉంటుంది. బాలీవుడ్లో రన్వీర్ సింగ్, ఫరాన్ అక్తర్ నాకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు.