ఐశ్వర్య నటించిన జజ్బా సినిమా ట్రైలర్ టాక్, పోస్టర్స్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఎందువల్లో హిట్ టాక్ తెచ్చుకోలేక పోయింది. ఐశ్వర్య రీ ఎంట్రీ, ఆమె మునుపటి అందం ఈ సినిమాకు ప్లస్ కాలేదు. కానీ నిర్మాత మాత్రం ఒప్పుకున్న డబ్బును ఐశ్వర్యకు ఇవ్వలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నటించినందుకు ఐశ్వర్యకు నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ఒప్పుకున్నాడట ప్రొడ్యూసర్. అడ్వాన్స్‌గా కోటి ఇచ్చి షూటింగ్ కానిచ్చేసుకున్నాడట. తీరా సినిమా పూర్తయ్యాక మనీ విషయంలో ప్రొడ్యూసర్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చాడు. ఈలోగా ఐశ్వర్యరాయ్ ఈ మూవీ ప్రచారానికి దూరంగా వుండడంతో పరిస్థితి గమనించిన డైరెక్టర్ సంజయ్ గుప్త నిర్మాతల పేర్లలో ఐశ్వర్య ను కూడా చేర్చి, వచ్చిన లాభాల్లో వాటాగా మూడు లక్షలు ముడతాయనుకున్నాడట. చివరకు సినిమా ఫ్లాప్ అయ్యింది. లాభాలేవీ రాలేదు. ఇంకెక్కడి మూడు కోట్లు. ఐశ్వర్యకు కుచ్చుటోపీ తగిలించినట్టే నిర్మాత!