మెగా పామిలీ నుంచి కొత్తగా ఎంటరైన వరుణ్‌తేజ్ కు రెండో సినిమా ఇంతటి సక్సెస్ సాధించడం ఈ హీరోను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. డైరెక్టర్ క్రిష్ చేసిన ప్రతి ప్రయోగం బాగుందన్న టాక్ వచ్చింది కానీ ‘కంచె’ సినిమాకు మాత్రం కలెక్షన్ల పరంగానూ లాభ పడుతున్నాడు. ఇలాంటి కొత్త ప్రయోగం ఇంతవరకూ తెలుగులో ఏ డైరెక్టరూ చేయకపోవడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సినీ సెలబ్రిటీల నుంచి చాలా ప్రశంసలు వచ్చాయి. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ రానటువంటి నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో కంచె సినిమా ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంది.
ఇక విడుదలకు ముందునుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదల తర్వాత పూర్తి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ను దాటేసి లాభాల బాట పట్టడమే కాకుండా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. యూఎస్‌లో ఈ సినిమా 425కే డాలర్లు వసూలు చేసి సూపర్బ్ అనిపించుకుంది. ఇక ఈ వారాంత ముగిసే సరికల్లా సినిమా హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం.