నాన్నకు ప్రేమతో డీసెంట్ హిట్ తర్వాత అదే ఊపుతో జనతా గ్యారేజ్ కి సిద్ధమైపోతున్నాడు ఎన్టీఆర్. గత రెండు చిత్రాల్లో బాడీ లాంగ్వేజ్ ను, స్టైలిష్ ను లుక్ ను మెయింటెన్ చేసిన జూనియర్ తన తర్వాతి సినిమా కోసం మరో కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడంట. కొరటాల శివ డైరక్షన్లో ఇంకా పట్టాలెక్కిన జనతా గ్యారేజ్ అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ ను అదరగొడుతుందని తెలుస్తోంది. ఏరియా వైజ్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి ప్రొడ్యూసర్ లను సేఫ్ జోన్ లోకి చేరవేసిందట.
ముఖ్యంగా కేరళలో ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా బాహుబలి మళయాళంలో అత్యధిక రేటుకు అమ్ముడు పోయిన తెలుగు చిత్రం బాహుబలి. అది అక్కడ 3.25 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు జనతా గ్యారేజ్ ఆ రికార్డును బద్ధలు కొట్టినట్లు సమాచారం. ఏకంగా 4.25 కోట్లకు ఈ చిత్రం అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మరో మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ విలన్ గా, నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మళయాళీ స్టార్ క్రూ ఉన్నందుకే ఈ చిత్రం అక్కడ అంత రేటుకు అమ్ముడు పోయిందనేది టాక్.