వామ్మో... ఆ వ్యాపారికి ఇదేం డాంబికం...

April 30, 2015 | 02:59 PM | 148 Views
ప్రింట్ కామెంట్
jacqueline_fernandez_niharonline

ఒకప్పటి హీరోయిన్లయితే పది పదిహేను సంవత్సరాలు హీరోయిన్లుగా తెరమీద వెలిగిపోయారు... కానీ ఇప్పుడు అలా కాదు కదా... చేతినిండా డబ్బులు సంపాదించుకోవచ్చునని పోటీలు పడి మరీ ఈ ఫీల్డ్ కు వచ్చేస్తున్నారు. అందుకే ఛాన్స్ వచ్చిందే తడవుగా గబగబా నాలుగు రాళ్ళు వెనకేసుకొని ఎంచక్కా కోట్లు గడిస్తున్నారు. ఈ విషయాల్ని బాగా వంటబట్టించుకుంది‘కిక్-2’ ఫేమ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ . లక్నోకి చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమారుడి పెళ్లి చాలా ఘనంగా చేయాలనుకున్నాడట. ఆ పెళ్ళిలో ఓ తారను ఆహ్వానిస్తే మరింత ఘనంగా ఉంటుందనుకున్నాడు. డబ్బుకు కొదవలేని వ్యాపారవేత్త. తన డాంబికమంతా చూపించాలనుకుని, ఆ వేడుకలో జాక్వెలిన్ ఆటాపాటా చూపించాలనుకున్నాడు. వెంటనే అమ్మడిని సంప్రదించి నాలుగు కోట్లు ఈ ఆటా పాటకు చెల్లించడానికి సిద్ధమయ్యాడట! సినిమా వాళ్ళపై ఉన్న క్రేజ్ ఎంతో... రెండు రోజుల బాగోతానికి నాలుగు కోట్లు ఖర్చుపెట్టే ఈ వ్యాపారిని చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు సినిమా తారలకు సినిమా ఛాన్సులతో పాటు ఇలాంటి ఆదాయం కూడా ఉందన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ