అప్పటి హీరోయిన్లకు ఈగో మాములుగా లేదండోయ్

January 20, 2015 | 12:42 PM | 32 Views
ప్రింట్ కామెంట్

ఇప్పటితరం హీరోలుకానీ, హీరోయిన్లు గానీ ఎలాంటి వైషమ్యాలు లేకుండా స్నేహంగా కొనసాగటం మనం చూస్తుంటాం. ఉదాహరణకు మెగా, మంచు ఫ్యామిలీ పెద్దలకు జరిగే ఇన్నర్ వార్ అందరికీ తెలిసిందే. కానీ, వారి వారసులు మాత్రం అలాంటివేం పెట్టుకోకుండా ఎంతో స్నేహంగా ఉండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకప్పటీ హీరోల సంగతి ఏమోకానీ హీరోయిన్లకు మాత్రం ఓ రేంజ్ లో ఈగో ప్రాబ్లం ఉండేదట. ఎంతలా ఉందనేది స్పష్టంగా చెప్పారు అలనాటి అగ్రహీరోయిన్ జయప్రద. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సౌందర్యలహరి కార్యక్రమానికి హాజరైన జయప్రద అప్పట్లో జరిగిన ఓ చిన్న ఉదాహరణను ఈ సందర్భంగా వివరించారు. ఒకసారి ఓ సినిమా షూటింగ్ సందర్భంగా రాఘవేంద్రరావు కావాలనే శ్రీదేవిని, జయప్రదని ఒకే రూమ్‌లో వేసి తాళం వేశాడట. అప్పుడు శ్రీదేవి కానీ, జయప్రద కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోడానికి అస్సలు ప్రయత్నించలేదట. సరికదా కనీసం ఒకరి కళ్లలోకి ఇంకొకరు చూసుకోలేదట. ఇక అర్థం చేసుకోండి వారి మధ్య ఎంత ఈగో ఉందో... అంతేకాదు ఈ విషయంలో ఇప్పటి హీరోయిన్లు చాలా బెటరని కూడా ఓపెన్ గా చెప్పేసింది జయపద్ర.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ