ఈసారి మా అధ్యక్ష పదవి కోసం పోటీ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇరు గ్రూపులు తమ మద్దతు ఇవ్వాలంటూ పలువురు ప్రముఖుల ఇళ్ళకు వెళ్ళి కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సీనియర్ నటి జయసుధ సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. అక్కడే అల్పాహారం కూడా చేశారు. తనకు మద్దు ఇవ్వాల్సిందిగా ఆ కుటుంబంలోని సినిమా ఆర్టిస్టులను కోరారు. శుక్రవారం సాయంత్ర ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జయసుధ మాట్లాడుతూ, మురళీ మోహన్ పోటీ చేయమని చెప్పడంతో నామినేషన్ వేశాననీ, అయినంత మాత్రాన ప్రతి విషయంలోనూ ఆయన చెప్పినట్లే వింటానని అనుకోవద్దు అన్నారు. పరిశ్రమలోని మంచి చెడ్డలు తనకు తెలుసునన్నారు. ఇప్పుడు కళాకారులకు ఏది అవసరమో అదే చేస్తాం... కానీ గెలుపు కోసం దొంగ హామీలు ఇచ్చేది లేదన్నారు. అసోసియేషన్ లో అవకతవకలు ఎక్కడ జరిగాయన్నది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. గెలిచిన తర్వాత ముందు అదే పని చేస్తాను. సినీ పరిశ్రమలోని వారి పిల్లల పెళ్ళిళ్ళకు తప్పక సహాయం అందిస్తామన్నారు.