బాలీవుడ్ నుంచి మరో అందాల భామను తమిళ సినిమా కోసం తెచ్చేసుకున్నారు. ఈ ముద్దు గుమ్మ పేరు ముగ్ద గాడ్సె. అమ్మడు పేరుకు తగ్గట్టే ముగ్ధమనోహరంగానే కనిపిస్తోంది. ఆమె నటించబోయే సినిమా ‘థాని ఒరువన్’ ఈమెకు జంటగా ఒకప్పటి అందాల నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం జయం రాజా, జయం రవి, హీరోయిన్ నయన తార ప్రధాన పాత్రలో నటిస్తోందట. ఈ చిత్రంలో అరవింద్ ఓ పవర్ రోల్ లో నటిస్తున్నాడట ఈయన పక్కన జంటగా నటించడానికి ఎంతో మందిని వెతికి వెతికి చివరికి ముగ్ధను ఎంపిక చేసుకున్నారని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. ఈ కొత్త భామ తిరిగి వెనక్కు వెళుతోందా? లేక దక్షిణాది సినిమా ఛాన్సులు దక్కించుకుంటుందో వేచి చూద్దాం.