ప్రముఖ సినీ నటి జీవిత రాజశేఖర్ సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ద మెసెంజర్ ఆఫ్ గాడ్ సినిమాకు అప్పిలేట్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడంతో నిరసిస్తూ బోర్డు చీఫ్ లీలా శాంసన్, ఇతర సభ్యులు రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలాని బోర్డు చైర్‌పర్సన్‌గా నియమితులయిన విషయం తెలిసిందే. ఈయన బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హాకు బావమరిది. నిహలానితో పాటు 9మంది సభ్యులతో కూడిన కొత్త కమిటీని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీరిలో తెలుగు పరిశ్రమ నుంచి నటి, నిర్మాత జీవిత రాజశేఖర్ కు స్థానం కల్పించారు. 9మంది సభ్యుల జాబితాను చూస్తే.., మిహిర్ భూటా, అశోక్ పండిట్, చంద్ర ద్వివేది, వాణి త్రిపాఠి, సయ్యద్ బరి, జార్జ్ బేకర్, ఎన్.శేఖర్, రమేష్ పతంగె, జీవిత రాజశేఖర్ ఉన్నారు. కొత్త చైర్మన్ గా నియమితులైన పహ్లాజ్ నిహలానీ బాలీవుడ్ గుర్తింపు పొందిన నిర్మాత. ఆయన నిర్మించిన ‘ఆంఖే’, ‘షోలా ఔర్ షబ్నమ్’, ‘తలాష్’ వంటి సినిమాలో చాలా పాపులర్ అయ్యారు.. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంపికైన జీవిత నటిగా కెరీర్ మొదలు పెట్టి, ఎన్నో సినిమాల్లో రాజశేఖర్ సరసన హీరోయిన్ గా నటించిన చివరకు ఆయన్నే పెళ్లి చేసుకున్నారు. తర్వాత నిర్మాతగా మారారు. రాజశేఖర్ కథానాయకుడిగా అనే సినిమాలు నిర్మించారు. సొంతంగా బ్యానర్ ప్రారంభించారు. చిన్న నిర్మాతల సంఘంలో జీవిత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇండస్ట్రీలో కార్మికుల సమస్యలపై ముందుండి పోరాడే జీవితకు కేంద్ర సెన్సార్ బోర్డులో అవకాశం రావటం సంతోషకరమని ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు చెపుతున్నారు.