నారాయణ మూర్తి సినిమాలంటేనే ఓ విప్లవ భావం మదిలో మెదులుతుంది. ఈ ఎనర్జిటిక్ హీరో సినిమాలు ఇటీవల కాలంలో తగ్గినట్టు కనిపిస్తున్నాయి. కానీ అడపా దడపా తీస్తున్నా విజయం సాధించడం లేదు. ఆయన తీసిన ఎర్రసైన్యం, చీమల దండు, ఓరేయ్ రిక్షా వంటి సినిమాలూ ఎప్పుడూ ప్రేక్షకుల మదిలో నిలిచి ఉండే సినిమాలు. ఆయన సినిమాలంటే అవే... అన్నట్టు ముద్ర వేసుకున్న నటుడు. నారాయణ మూర్తి. ఆయన అన్నా, ఆయన సినిమాలన్నా పూరీ జగన్నాథ్ కు చాలా అభిమానమట. అందుకే ఆయనకు టెంపర్ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రను క్రియేట్ చేసి మరీ ఆఫర్ ఇచ్చాడట. మొదట్లో ఓకే అన్న ఈ నటుడు ఎందుకో తరువాత నేను చేయలేనని చెప్పాడట. ఆయనకున్న ఓ ప్రత్యేక గుర్తింపుకు బ్రేక్ పడుతుందనుకున్నాడేమో... నారాయణ మూర్తి కూడా కమర్షియల్ ఆర్టిస్టు అని అందరి చేతా అనిపించుకోవడం ఇష్టం లేకనో గానీ పూరీ అభిమానంతో ఇచ్చిన ఆఫర్ ను కాదన్నాడు… తాను నమ్మిన సిద్ధాంతలకు కట్టుబడి, విప్లవ భావాలతో అణగారిన, దోపిడీకి గురవుతున్న బడుగు వర్గాలను చైతన్యవంతం చేసే తరహా చిత్రాలకు మాత్రమే పరిమితమైన నారాయణమూర్తిని మామూలు సినిమాల్లో చూస్తే జనం మెచ్చుతారో లేదో కానీ, పూరీ జగన్నాథ్ కోటి రెమ్యునరేషన్ ఇస్తానని కూడా అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయినా రిజక్ట్ చేశాడంటే ఈయనకున్న సిద్ధాంతం మీద గౌరవం కలుగుతుంది ఎవరికైనా.