ఆయన సినిమాలు మాత్రమే చూసి... గ్రేట్ అనుకుంటున్న సామాన్య జనాలకు ఇది విడ్డూరంగానే అనిపించవచ్చు. కానీ బాహుబలి చిత్రం కోసం రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ని ఒక ఆర్ట్ డైరెక్టర్ తిరస్కరించాడట. ఆయన సినిమాల్లో నటిస్తే ఒక హిట్ తమ ఖాతాలో చేరిపోతుందని అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు నటీ నటులు. సామాన్య జనానికి సాంకేతిక వర్గం గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ రాజమౌళి సినిమాను తిరస్కరించడం అంటే విచిత్రంగానే అనుకుంటారు. రవీందర్ రెడ్డి గతంలో రాజమౌళి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా చేశాడట. అతని పనితనమంటే రాజమౌళికి చాలా ఇష్టం కూడా నట. మరి ఆయన ఎందుకు తిరస్కరించారు.... అంటే బహుబలి సినిమా కోసం నాలుగేళ్ళు పని చేయాలని కండిషన్ పెట్టారట రాజమౌళి. దాంతో అంత సమయం ఒకే సినిమాకు పనిచేయలేనని సున్నితంగా తిరస్కరించాడట. దాంతో సాబు సిరిల్ తో ఆ స్థానాన్ని బర్తీ చేశాడు మౌళి. అయితే ఈ నాలుగేళ్ళలో రవీందర్ రెడ్డి ఏడు సినిమాలకు పనిచేశాడట. ఎవరి ధోరణి వారిది... ఇక్కడ ఎవరినీ తప్పుపట్టలేం కదా మరి...