వంశీ ఓకే అయితే మరి కొరటాలో...?

October 10, 2015 | 05:36 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Jr_NTR_next_movie_director_vakkantam_niharonline

‘నాన్నకు ప్రేమతో’ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చేశాయి.  ఆ సినిమా కన్ ఫం చేశారు కూడా. కానీ ఇప్పుడు కొత్తగా అన్నకళ్యాణ్ రాం  సినిమానే ఒకే చేస్తున్నట్టు వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన సంస్థలోనే  సినిమా చేయాలని యంగ్ టైగర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `నాన్నకు ప్రేమతో` చేస్తున్న ఎన్టీఆర్ కోసం ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు తమ సినిమాలోకి హీరోగా తీసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ లాంటి వాళ్ళంతా ఎన్టీఆర్ కాల్షీట్ల కోసం క్యూ కట్టారట. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈసారి తన అన్న కళ్యాణ్ రామ్ కోసమే ఓ సినిమా చేయబోతున్నాడట.  వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్టీఆర్ తో తన నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయాలని కళ్యాణ్ రామ్ ఎప్పట్నుంచో అనుకొంటున్నాడు. వక్కంతం చెప్పిన కథ ఎన్టీఆర్ కి కూడా నచ్చడంతో ఓకే చెప్పాడట. అయితే రకరకాల కారణాల వల్ల  ఆ ప్రాజెక్టు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఆ వార్త వినిపిస్తోంది. `నాన్నకు ప్రేమతో` సినిమా పూర్తయిన తర్వాత వక్కంతం వంశి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.  మరి ఇదే నిజమైతే కొరటాలతో ఎన్టీఆర్ తరువాతి సినిమా ఉంటుందనీ, కొరటాలను డైరెక్ట్ గా ఎన్టీఆర్ వెళ్ళి అడిగినట్టు కూడా వార్తలు వినిపించాయి. మరి ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఎప్పుడు? ఇది వాయిదా పడుతోందా? లేక కొరటాల మరో హీరోతో తన ప్రాజెక్టు మొదలు పెడతాడా అనే విషయాలు అఫీషియల్ గా వెలువడే వరకూ వెయిట్ చేయాల్సిందే.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ