తండ్రయ్యాక తారక్ లో ఇంత మార్పా!

February 10, 2015 | 02:50 PM | 28 Views
ప్రింట్ కామెంట్

కాజల్ లో ఇప్పుడు నాజూకు తనంపోయి బొద్దమ్మాయిగా మారిపోయింది. ఈ అమ్మడు ఇప్పటి వరకూ ఎన్టీఆర్ తో మూడు సినిమాల్లో నటించింది. టెంపర్ సినిమా ఇప్పుడు విడుదలకు రెడీగా ఉంది. అయితే మూడు సినిమాల్లో ఎన్టీఆర్ తో కెమిస్ట్రీ చాలానే ఉండి ఉంటుంది కదా ఈ అమ్మడికి. పెళ్ళికాని ఎన్టీఆర్ పెళ్ళయిన ఎన్టీఆర్ ను బాగా ఎరుగున్న నటీ మణి అంటే కాజల్ అనే చెప్పవచ్చు. టెంపర్ కు ముందు బృందావనం, బాద్షాలో నటించింది. అయితే టెంపర్ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి చాలా ఆసక్తికరమైన అంశాలు బయట పెట్టింది. ఎన్టీఆర్ నటనలో చాలా మార్పు వచ్చేసిందంటోంది. తండ్రయిన తరువాత ఎన్టీఆర్ లో వచ్చిన మార్పును బాగా గమనించానంటోంది. ‘‘సందేహమే లేదు. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. కానీ తండ్రి అయిన తరువాత అతను చాలా చాలా మారాడు. అతనితో నేను పెళ్ళికి ముందు తరువాత కూడా నటించాను. ఈ మార్పు నాకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తోంది. ఇతను ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటున్నాడు. సెట్స్ పై ఉన్నప్పుడు తన కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తాడు. ఈ పాజిటివ్ హాప్పీనెస్ అనేది వ్యక్తిగానే కాదు నటనపై కూడా అతనిపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇది ఆయన పెర్ఫార్మెన్స్ లో బాగా మార్పు తీసుకువచ్చింది’’ అంటోంది కాజల్. ఇక తను డాన్స్ చేసే విధానం అందరికీ తెలిసిందే అతనితో కలిసి డాన్స్ చేయడమనేది పెద్ద టాస్క్ లాంటిదని చెపుతోంది. ఇంతకూ కాజల్ చెపుతున్నదేంటంటే వెనకటికి పెద్దలు చెప్పిన పుత్రోత్సాహం ఇప్పుడు ఎన్టీఆర్ లో కనిపిస్తున్నదన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ