ఛార్మి ప్రధానపాత్రలో ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా రూపొందుతోన్న చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మే 17న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఛార్మి ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా.... పూరిజగన్నాథ్ మాట్లాడుతూ ‘‘మల్లాది వెకట కృష్ణమూర్తి రచించిన సుప్రసిద్ధ నవల మిసెస్ పరాంకుశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ ట్రెండ్‌కి తగిన విధంగా మార్పులు చేసి డైరెక్ట్ చేశాం. ఆయన ఈ కథను రాసినప్పుడు నేను పట్టి ఉంటాను. పాతికేళ్లకు ఛార్మి పుట్టి ఉంటుంది. ఈ నవల సినిమాగా ఇప్పుడు రూపొందింది. ఛార్మి మనసు పెట్టి ఈ సినిమా చేసింది. కళ్యాణ్‌గారితో పనిచేయడం చాలా హ్యపీగా ఉంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ జరుగుతుంది. కళ్యాణ్‌గారు సినిమాని జూన్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆయన రిలీజ్ డేట్ అనుకున్న వారం పదిరోజులకు సినిమా ఆడియో విడుదల ఉంటుంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్’’ అన్నారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘జ్యోతిలక్ష్మీ సినిమాలో నటించిన మా ఛార్మికి ఈ పుట్టినరోజు మొమరబుల్‌గా ఉండిపోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరూ ఛార్మి నటన గురించి, సినిమా గురించి మాట్లాడుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకు ఎంటర్‌టైనింగ్, రొమాన్స్ సినిమాలు చేసిన ఛార్మి ఈ సినిమాలో సరికొత్తగా కనపడుతుంది. పోకిరిలో మహేష్, టెంపర్‌లో ఎన్టీఆర్, చిరుతలో చరణ్‌లాగా ఎమోషనల్‌గా కనపడుతుంది. పూరిగారితో ఏడు సంవత్సరాల నుండి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాతో కుదిరింది. ఇదొక యూత్‌ఫుల్, ఎమోషనల్, రొమాంటిక్ డ్రామా. ఈ సినిమా పూరి నాకు ఇచ్చిన గిఫ్ట్‌గా అనుకుంటాను. త్వరలోనే ఆడియో, జూన్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్‌లో ఈ సినిమా తప్పకుండా ఉంటుంది’’అన్నారు. ఛార్మి మాట్లాడుతూ ‘‘పూరిగారు, ఆయన టీమ్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ టీజర్‌లో బుల్లెట్ రైడ్ చేసే సీన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆ సీన్‌లో నేనే యాక్ట్ చేశాను. బుల్లెట్‌ను నేనే రైడ్ చేశాను’’అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా సంపూర్ణేష్ బాబు, కాదంబరి కిరణ్, హీరో సత్య, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. మే 17న ఛార్మి పుట్టినరోజు సందర్భంగా ఛార్మి అభిమానులు, చిత్రయూనిట్‌తో కలిసి కేక్ కటింగ్ చేసింది. ఛారి, సత్య, వంశీ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కెమెరా: పి.జి.విందా,నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.