ఛార్మి సమర్పణలో ప్రధానపాత్రలో నటిస్తూ సి.కె.ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలింస్ బ్యానర్స్‌పై సంయుక్తంగా రూపొందిన చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. జూన్ 12న విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా శనివారం చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...
పూరిజగన్నాథ్ మాట్లాడుతూ ‘‘సినిమాకి ఆడియెన్స్‌ను మంచి రెస్పాన్స్ వస్తుంది. నా గురువు రామ్‌గోపాల్ వర్మగారు నీ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ తీశావని మొదటిసారి కాంప్లిమెంట్ ఇచ్చారు. మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు నా కథను ఇంత ట్రెండీగా తీశావని మెచ్చుకున్నారు. రచయిత సత్యమూర్తిగారు నా లైఫ్‌లో బెస్ట్ పెన్‌గా ఫీలై చేసిన సినిమా ఇది. ఆడవాళ్లకి మగవాళ్లే కాదు. ఆడవాళ్లకి ఆడవాళ్లుకూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వేశ్య కూడా ఆడదే. ఈ సినిమా చూసి సాటి స్త్రీల పట్ట రెస్పెక్ట్ పెంచుకోండి. స్త్రీగా పుట్టి సినిమాలంటే ఇష్టపడేవారు చూడాల్సిన సినిమా ఇది. అలాగే స్త్రీగా పుట్టి సినిమాలంటే ఇష్టపడనివారు చూడాల్సిన ఆఖరు సినిమా ఇది’’ అన్నారు.
ఛార్మి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో నన్ను అందరూ జ్యోతిలక్ష్మీ అని పిలుస్తున్నారు. ఈ రోజు ఉదయం నేనుండే సోసైటీ నుండి కొంత మంది ఆడవాళ్లు వచ్చి ఈ సినిమాలో బాగా నటించానని మెచ్చుకుంటున్నారు. అలాగే థియేటర్స్‌కి వెళ్లినప్పుడు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక సినిమాని ఇష్టపడేవాళ్లు వారి ఫ్యామిలీతో కలసి చూడదగ్గ చిత్రమిదని గర్వంగా చెబుతున్నాను’’ అన్నారు.
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుండి సినిమా పెద్ద హిట్టవుతుందని చెబుతున్నాను. అందుకు నిదర్శనమే ఈ రోజు ఆడియెన్స్ ఇచ్చిన ఈ సక్సెస్. సక్సెస్ సినిమాని ఎవరూ ఆపలేరు. ఫెయిల్యూర్ సినిమాని ఎంత ప్రమోషన్ చేసినా వేస్ట్. ఇప్పటి వరకు చాలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే మొదటిసారి 450 థియేటర్స్‌లో విడుదలైన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ క్రెడిట్ అంతా పూరి అన్నయ్యదే. పూరిగారి టేకింగ్, ఛార్మిగారి పెర్‌ఫార్మెన్స్ సినిమాని బిగ్గెస్ట్ హిట్ మూవీగా చేశాయి. మహిళా చిత్రంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిది. పూరి అన్నయ్య ఈ సక్సెస్‌ను నాకు ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తాను. ఛార్మి ప్రొడక్షన్ మేనేజ్ చేస్తూ హీరోయిన్‌గా నటించింది. తను చాలా మంచి ఆడ్మిన్. త్వరలోనే ఏక్తాకపూర్‌లాగా ఛార్మికి కూడా ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది. ఈ టీమ్‌తో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తాం. త్వరలోనే పూరిగారి దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌తో సినిమా ఉంటుంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళుతున్నాం. ఆ సినిమాని కూడా పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
హీరో సత్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేస్తే చాలని వచ్చాను. కానీ హీరోగానే నటించాను. అందుకు పూరిగారికి థాంక్స్. ఈ సినిమా చూస్తే మన ఇంట్లో ఉన్న స్త్రీల పట్ల ఉన్న గౌరవం రెట్టింపు అవుతుంది’’ అన్నారు.