నటించింది కొద్ది కాలమే అయినా టాప్ హీరోల సరసన మంచి హిట్ సినిమాల్లో నటించింది జ్యోతిక. 'ఠాగూర్', 'మాస్', 'షాక్' వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించి, తమిళ హీరో సూర్యని పెళ్ళి చేసుకుని... ఇల్లు పిల్లలూ అంటూ సినిమాలకు దూరమైపోయింది. అయితే ఇప్పుడు తిరిగి సినిమాలపై మళ్ళీ మనసు తిరిగినట్టుంది. తిరిగి తమ సొంత బేనర్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో ఓ సినిమా చేసింది. సూర్య ఆమెకుసపోర్ట్ ఇవ్వడం వల్లే తాను సినిమాల్లో నటించగలుగుతున్నానని జ్యోతిక చెప్పుకొచ్చింది. పెళ్ళయ్యాక చాలా బాధ్యతగా ఇంటిపనులు చూసుకుంటూ, అటు పిల్లల్ని పెంచుకోవడం, సినిమాల్లో నటించడం, ఇవి కాకుండా భర్త సూర్య, మరిది కార్తీ సినిమాల గురించి కూడా తనే బాధ్యత తీసుకోవడం వంటివన్నీ సమర్థవంతంగా చేస్తుందట జ్యోతిక. బాధ్యత అనేది కష్టం అనుకోనప్పుడు ఎన్నిపనులైనా ఇష్టంగా పూర్తిచేసుకోవచ్చునని నిరూపిస్తోంది జోతిక. ఇప్పుడు ఆమె మససు దర్శకత్వం వైపు పడిందట. ఇకనేం ఇంట్లోనే ఇద్దరు హీరోలున్నప్పుడు... ఆ ఇద్దరు హీరోలకూ తానే సలహాలిస్తున్నప్పుడు దర్శకత్వం చేస్తే నటించడానికి ప్రత్యేకంగా హీరోలకు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా జ్యోతికకు.