రావమ్మా జ్యోతికమ్మా.... రావమ్మా...

June 16, 2015 | 03:47 PM | 0 Views
ప్రింట్ కామెంట్
Jyothika_36_Vayadhinile_movie_niharonline

ఈ మధ్యే తమిళంలో విడుదలై సక్సెస్ అందుకున్న ‘36 వయదినలే’ సినిమా -రావమ్మా మహాలక్ష్మి’ అనే పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ... నాదంతా ఓవర్ యాక్షనేనని వ్యాఖ్యానించారు. 2000 సంవత్సరం వరకు పలుభాషల్లో  చిత్రాలు చేసి ప్రముఖ నటిగా రాణించిన నటి జ్యోతిక. నటుడు సూర్యతో కలిసి నటిస్తున్న సమయంలో ఆయనతో ప్రేమలోపడి పెళ్లి చేసుకుని నటనకు దూరమైంది. భర్త, పిల్లలు అంటూ సంసార జీవితాన్ని ఆస్వాదించి, సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్ళీ ముఖానికి రంగేసుకుని తెరపైకొచ్చారు. మలయాళంలో హౌ ఓల్డ్ ఆర్‌యూ పేరుతో విడుదలై సూపర్‌హిట్ అయిన ఈ చిత్రం తమిళంలోనూ మంచి విజయాన్ని సాధించింది. ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ ఈ చిత్రం విజయం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. నిజానికి నేనీ చిత్రంతో చాలా కొన్ని సన్నివేశాల్లోనే యదార్థంగా నటించాను. మిగతా సన్నివేశాలన్నిటిలోనూ ఓవర్ యాక్షనే కనిపిస్తుంది. ఈ చిత్రమే కాదు ఇంతకు ముందు నటించిన చిత్రాలు చూస్తున్నప్పుడు నా యాక్టింగ్ కొంచెం ఓవర్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతెందుకు చంద్రముఖి చిత్రంలో నేను బాగా చేశానని పలువురు ప్రశంసించారు. ఆ చిత్రంలోనూ నాది ఓవరాక్షనే. ఎప్పటికప్పుడు సహజత్వానికి దగ్గరగా నటించాలని అనుకునేదాన్ని. షూటింగ్‌కు వెళ్లిన తరువాత కాస్త తగ్గించి నటిస్తుంటే దర్శకులు వచ్చి ఏమిటమ్మా ఒంట్లో బాగోలేదా? ఏదయినా సమస్యా?అంటూ ప్రశ్నలు వేస్తూ ఇంకాస్త ఉత్సాహంగా నటించమ్మా అని చెప్పేవారు. అలా నన్ను ఓవర్ యాక్షన్ నుంచి బయట పడకుండా చేసేశారు’ అంది నవ్వుతూ జ్యోతిక.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ