ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు గడిచినప్పటికీ కాజల్ అగర్వాల్ ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. అగ్రకథానాయకుల సరసన మాత్రమే నటించడానికి అంగీకరిస్తూ, మరోవైపు సినిమాల సంఖ్య తగ్గినా ఆమె అదే పద్ధతిలో ముందుకు వెళుతోంది. ఈ ఏడాది ఆమె తెలుగులో ఒక సినిమా మాత్రమే చేసింది. 'టెంపర్' తరువాత ఆమె మరో తెలుగు సినిమా చేయకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. కానీ, తమిళ్లో ధనుష్ ..విశాల్ సరసన రెండు సినిమాలు చేసి ఫరవాలేదు అనిపించుకుంది.
ఇక వచ్చే ఏడాది మాత్రం తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఎక్కువ సందడి చేసేట్టుగా ఆమె ప్లాన్ చేసుకుంది. తెలుగులో పవర్ స్టార్ సరసన 'సర్దార్' లో .. మహేశ్ బాబు జోడీగా 'బ్రహ్మోత్సవం' చిత్రాల్లో నటిస్తోంది. తమిళ్లో జీవాతో కలిసి 'కవలై వేందాం'లో నటిస్తోన్న ఆమె, విక్రమ్ సరసన కథానాయికగా మరో సినిమాను అంగీకరించింది. హిందీలో 'దో లఫ్జోన్ కి కహాని'లో నటిస్తోన్న కాజల్, మరో హిందీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమాలన్నీ వేసవి సెలవులలో విడుదలకి సిద్ధమవుతూ వుండటం విశేషం. అన్ని భాషల్లో రెండేసి చిత్రాల్లో నటిస్తూ తన కాల్షీట్లను ఫుల్ బిజీగా మార్చేసుకుందీ చందమామ.